'చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఎంతో ఇష్టం' | Sakshi
Sakshi News home page

'చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఎంతో ఇష్టం'

Published Mon, Jun 27 2016 9:16 AM

'చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఎంతో ఇష్టం' - Sakshi

 వర్ధమాన సినీ సంగీత దర్శకుడు యోగేశ్వరశర్మ
అమలాపురం: అవకాశం ఇస్తే అగ్రహీరోల చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాలని ఉందని వర్ధమాన సినీ సంగీత దర్శకుడు, సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు యోగేశ్వరశర్మ తెలిపారు. స్థానికంగా ఆదివారం నిర్వహించిన మహిళల రామాయణ ప్రోత్సాహక పరీక్షకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఆయన మాటల్లోనే... ‘నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఎంతో ఇష్టం. నా అభిరుచిని గుర్తించి మా నాన్నగారు సంగీతం వైపు పోత్సహించారు. లండన్‌లో మ్యూజిక్ కోర్సు చేసి, మృదంగం, కీ బోర్డులపై పట్టు సాధించా. ప్రముఖ సంగీత విధ్వాంసుడు వీఎస్‌మూర్తి వద్ద పని చేసిన తర్వాత సినీ పరిశ్రమలో అడుగు పెట్టాను. తొలుత లఘు చిత్రాలకు సంగీతం సమకూర్చాను. కుదిరితే కప్పు కాఫీ, ఎంత అందంగా ఉన్నావే, యామిని చంద్రశేఖర్, ఎవరు చిత్రాలకు సంగీతం అందించాను. ఇంకా పేరు పెట్టని రెండు కొత్త చిత్రాలకు సంగీత దర్శకత్వం వహిస్తున్నా. మంచి సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా ఆశయం'.

Advertisement

తప్పక చదవండి

Advertisement