
పదవీ విరమణ ప్రోత్సాహకాలు రావన్న అనుమానంతో భర్తపై దాడి
తలపై ఇనుప రాడ్‌తో కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి
అమలాపురం రూరల్: భర్త వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో అతని భార్య ఇనుపరాడ్డుతో అతడి తలపై దాడిచేసి హతమార్చిన ఘటన మండలం నడిపూడిలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నడిపూడి గ్రామ పరిధి మెట్ల రాంజీ కాలనీకి చెందిన దొమ్మేటి రాంబాబు (61) కాకినాడ ఆర్టీసీ చెకింగ్ స్క్వాడ్‌లో పనిచేస్తున్నాడు. అతని భార్య వెంకటరమణతో 30 ఏళ్ల క్రితం వివాహమైంది.
ఒక కుమార్తెకు ఒఆసై వివాహం చేశారు. కాగా రాంబాబు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంపై తరచూ ఆ భార్యాభర్తలు ఘర్షణ పడేవారు. ఈ క్రమంలో ఒక ఇంట్లోనే వారు వేరువేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన రాంబాఋతో అతని భార్య ఘర్షణపడింది. అనంతరం అర్ధరాత్రి నిద్రలో ఉన్న భర్త రాంబాబు తలపై ఇనుప రాడ్డుతో భార్య వెంకటరమణ దాడి చేసింది. దీంతో అతను ప్రాణాలు విడిచాడు.
ఈ విషయం శుక్రవారం సాయత్రం బయటికి రావడంతో సీఐ ప్రశాంత్ కుమార్, ఎస్సై శేఖర్ బాబు ఘటన స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారాలు సేకరించి వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. కాగా రాంబాబు ఉద్యోగ విరమణ దగ్గర పడడంతో అతడికి వచ్చే ప్రోత్సాహకాలు తనకు దక్కవనే అనుమానంతో ఈ హత్యకు పాల్పడినట్లు పొలీసు లు భావిస్తున్నారు. రాంబాబు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శేఖర్ బాబు తెలిపారు.