‘పాటకు సాహిత్యాన్ని బట్టే గౌరవం. సంగీతం ఇంటిపేరు సాహిత్యం‘ అని అన్నారు ప్రముఖ సినీసంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్. ఆదివారం విజయప్రొడక్ష¯ŒS ఆధ్వర్యంలో నగరంలో జరగనున్న బి.నాగిరెడ్డి స్మారక పురస్కార ప్రదాన సభలో పాల్గొనడానికి నగరానికి
సంగీతం ఇంటిపేరే సాహిత్యం
Apr 15 2017 11:28 PM | Updated on Sep 5 2017 8:51 AM
రాజమహేంద్రవరం కల్చరల్ :
‘పాటకు సాహిత్యాన్ని బట్టే గౌరవం. సంగీతం ఇంటిపేరు సాహిత్యం‘ అని అన్నారు ప్రముఖ సినీసంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్. ఆదివారం విజయప్రొడక్ష¯ŒS ఆధ్వర్యంలో నగరంలో జరగనున్న బి.నాగిరెడ్డి స్మారక పురస్కార ప్రదాన సభలో పాల్గొనడానికి నగరానికి వచ్చిన ఆయన శనివారం ‘సాక్షి’కి తన సినీ ప్రస్థానాన్ని వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
‘‘మాది సినీరంగంలో సీనియర్ మోస్ట్ కుటుంబం. 1935లోనే మాతాగారు మాధవపెద్ది వెంకట్రామయ్య నాలుగు సినిమాల్లో నటించారు. ప్రముఖ సౌండ్ ఇంజినీర్ వి.శివరాం, కథకుడు కొడవటిగంటి కుటుంబరావు మా బామ్మ మేనమామ కొడుకులు. మా బాబాయి మాధవపెద్ది సత్యం సోలోగా, జంటగా పాడిన సినీగీతాలు నేటికీ పాపులర్. ఇక నా సంగీతప్రస్థానం వయసు అర్ధశతాబ్దం, సినీరంగంలోకి వచ్చి 43 ఏళ్లు దాటింది.
సినీరంగంలో..
ఇంచుమించు అన్ని భాషల్లో, ప్రముఖ దర్శకుల పర్యవేక్షణలో 1500 సినిమాలకు కీబోర్డు ప్లేయరుగా పని చేశా. 1988లో ప్రముఖ దర్శకుడు నన్ను సంగీత దర్శకుడిగా ‘హైహై నాయకా’ చిత్రం ద్వారా పరిచయం చేశారు. తొలిసారిగా ఈ సినిమాకు జొన్నవిత్తుల రాసిన ‘ఇది సరిగమ లెరుగని రాగము’ పాటను కంపోజ్ చేశాను. ఇప్పటి వరకు 64 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాను.
ఇది వ్యాపారరంగం..
‘అలిగిన వేళనె చూడాలి..’ నుంచి ‘అమ్మడూ లెటజ్ డూ కుమ్ముడు’ వరకు సినీసంగీత రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. రికారి్డంగ్ రూమ్‌కు నాడు ఘంటసాల, సుశీల వచ్చి పాడేవారు. ఇవాళ గాయకులతో ఇంటివద్దే పాడించి, వాయిద్యాల హోరును మిక్స్ చేసుకోవచ్చు. కాలేజ్ స్టూడెంట్ కోసం నేను స్వరకల్పన చేసిన ‘మనసే హారతి, షిరిడి శ్రీపతి’ అన్న పాటకు అంతర్జాతీయంగా పేరు వచ్చింది.
అన్నం పెట్టిన సంస్థ విజయా ప్రొడక్ష¯Œ్స
మా కుటుంబానికి అన్నం పెట్టిన సంస్థ విజయా ప్రొడక్ష¯Œ్స. వారు నిర్మించిన భైరవద్వీపం సినిమాలో నేను కంపోజ్ చేసిన ‘నరుడా ఓనరుడా’, ‘శ్రీతుంబుర నారద నాదామృతం’పాటలకు నంది అవార్డులు వచ్చాయి.
‘విడదీయలేని అనుబంధమది..’
రాజానగరం : తెలుగు సినీ సంగీత సామ్రాజ్యానికి మాధవపెద్ది కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని చైతన్య విద్యా సంస్థల చైర్మన్, శాసన మండలి మాజీ విప్ కేవీవీ సత్యనారాయణరాజు(చైతన్యరాజు) అన్నారు. గైట్ కళాశాలను శనివారం సందర్శించిన తెలుగు సినీ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్‌ని సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
‘సంగీతానికి శ్రీకారం చుట్టింది ఇక్కడే’
సంగీత, సాహిత్యాలకు పుట్టినిల్లుగా విరాజిల్లుతున్న రాజమహేంద్రవరంతో తనకు విడదీయరాని బంధం ఉందని సినీ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ అన్నారు.
Advertisement
Advertisement