అత్తింటి అమానుషం | murder attempt on daughter in law | Sakshi
Sakshi News home page

అత్తింటి అమానుషం

Sep 12 2016 9:55 PM | Updated on Jul 30 2018 8:41 PM

అత్తింటివారి అమానుషంతో ఓ మహిళ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అదనపు కట్నం తీసుకురావడం లేదని కోడలిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన సంఘటన మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  • కోడలికి నిప్పటించి సజీవ దహనానికి యత్నం 
  • చావుబతుకుల్లో కోడలు
  • బచ్చన్నపేట : అత్తింటివారి అమానుషంతో ఓ మహిళ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అదనపు కట్నం తీసుకురావడం లేదని కోడలిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన సంఘటన మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు ప్రకారం.. మెదక్‌ జిల్లా సిద్ధిపేట పట్టణానికి చెందిన గట్టు సిద్ధయ్య మూడో కూతురు స్నేహ(సంధ్య)కు బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన బుస్స నాగరాజుతో 2008లో వివాహమైంది. పెళ్లి సమయంలో అన్ని కట్నకానులు సమర్పించారు.
     
    అయినా పెళ్లయినప్పటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని స్నేహను అత్తింటివారు వేధించసాగారు. అంతేగాక పండుగలకు  తల్లిగారింటికి కూడా పంపించకుండా ఇబ్బందులకు గురి చేశారు. ఆమె తల్లిదండ్రులు వచ్చిన కూడా ఆమెతో మాట్లాడించేవారు కాదు. అదనపు కట్నం విషయమై పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించినా అత్తింటివారిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ నెల 10న స్నేహ భర్త నాగరాజు, అత్త రాజమణి, ఆడపడుచు పుష్ఫ, బావ శ్రీనివాస్‌, తోటి కోడలు శ్రీదేవి కలిసి బలవంతంగా స్నేహపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. దీంతో ఆమె శరీరం పూర్తిగా 80 శాతం మేర కాలిపోయింది. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. తమ కూతురుకు న్యాయం చేయాలని స్నేహ తండ్రి సిద్ధయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్‌కుమార్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement