మద్యం తాగే సమయంలో చెలరేగిన గొడవలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తిపై విచక్షణరహితంగా దాడికి పాల్పడిన సంఘటన బుధవారం అర్ధరాత్రి పట్టణంలో జరి గింది. ఎస్సై రవీందర్ కథనం ప్రకారం.. పట్టణంలోని రాజిపేటకు చెంది న ఏకు నాగరాజు(30), అదే ప్రాంతానికి చెందిన గోవింద రాజ్‌కుమార్ బుధవారం రాత్రి మద్యం తాగుతున్నారు.
-
పరిస్థితి విషమం, హైదరాబాద్‌కు తరలింపు
-
పరారీలో నిందితుడు
పరకాల : మద్యం తాగే సమయంలో చెలరేగిన గొడవలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తిపై విచక్షణరహితంగా దాడికి పాల్పడిన సంఘటన బుధవారం అర్ధరాత్రి పట్టణంలో జరి గింది. ఎస్సై రవీందర్ కథనం ప్రకారం.. పట్టణంలోని రాజిపేటకు చెందిన ఏకు నాగరాజు(30), అదే ప్రాంతానికి చెందిన గోవింద రాజ్‌కుమార్ బుధవారం రాత్రి మద్యం తాగుతున్నారు. మద్యం తాగే సమయంలో నాకంటే నాకు అని గుంజుకున్నారు. రాజ్‌కుమార్ దగ్గర ఉన్న మద్యాన్ని నాగరాజు బలవంతంగా గుంజుకొని తాగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం నాగరాజు ఇంటికి వెళ్లకుండ అంబేద్కర్ సెంటర్‌లో ఉన్న టైర్ల కొట్టు వద్ద పడుకున్నాడు. ఇది గమనించిన రాజ్‌కుమార్ కత్తి పట్టుకొచ్చి నాగరాజుపై దాడికి పాల్పడ్డాడు. నాగరాజు తలపై ఐదు చోట్ల, కుడిచేతి భుజంపై కత్తితో పొడిచి తీవ్రంగా గాయపర్చి పరారయ్యాడు. రక్తపు మడుగులో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నాగరాజును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నాగరాజును 108లో సివిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎం జీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాగరాజు పరిస్థితి విషమంగానే ఉంది. నింది తుడు రాజ్‌కుమార్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటన పట్టణంలో కలకలం సృష్టించింది.