భైంసాలో ఎమ్మార్పీఎస్ ధర్నా | MRPS Leaders protests in Bhainsa | Sakshi
Sakshi News home page

భైంసాలో ఎమ్మార్పీఎస్ ధర్నా

Aug 4 2015 1:47 PM | Updated on Sep 3 2017 6:46 AM

పోలీసులు సరైన బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం వల్లే సోమవారం ఇద్దరు ఎమ్మార్పీఎస్ నాయకులు హత్యకు గురయ్యారని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆరోపించారు.

ఆదిలాబాద్ : పోలీసులు సరైన బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం వల్లే సోమవారం ఇద్దరు ఎమ్మార్పీఎస్ నాయకులు హత్యకు గురయ్యారని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆరోపించారు. అందుకు నిరసనగా భైంసాలో మంగళవారం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నేతలు మాట్లాడుతూ పోలీసులు రక్షణ కల్పించకపోవడంతో బెల్లంపల్లిలో ఇద్దరు నేతలు హతమయ్యారని విమర్శించారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తాము రాస్తారోకో చేశామన్నారు. రాస్తారోకోతో స్థానికంగా భారీగా ట్రాఫిక్ స్తంభించి పోయింది.

Advertisement
 
Advertisement
Advertisement