పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య | Mother Suicide with her Two Childrens at Nizamabad | Sakshi
Sakshi News home page

పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Feb 15 2016 3:03 AM | Updated on Apr 4 2019 4:46 PM

పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య - Sakshi

పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే అదనపు కట్నం కోసం వేధించడంతో ప్రేమికుల దినోత్సవం రోజే ఇద్దరు పిల్లలను హతమార్చి తనూ ఆత్మహత్య చేసుకుందో ఇల్లాలు.

నిజామాబాద్ జిల్లాలో ఘటన

 ధర్పల్లి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే అదనపు కట్నం కోసం వేధించడంతో ప్రేమికుల దినోత్సవం రోజే ఇద్దరు పిల్లలను హతమార్చి తనూ ఆత్మహత్య చేసుకుందో ఇల్లాలు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వెంగల్‌పాడ్ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంగల్‌పాడ్ తండాలో బదావత్ శ్రీనివాస్, డొంకల్ గ్రామ పరిధిలోని దేవునితండాకు చెందిన అరుణ (26)లు  2009లో ప్రేమవివాహం చేసుకున్నారు.

వీరికి  కొడుకు శ్రీకర్(4), కూతురు సుచిత్ర (8 నెలలు) ఉన్నారు. కొంతకాలంగా శ్రీనివాస్ అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్నాడు. మరో పెళ్లి చేసుకునేం దుకు  ప్రయత్నాలు మొదలు పెట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన అరుణ ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇద్దరు చిన్నారులను ఫ్యాన్‌కు ఉరి వేసి, తనూ దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement