తల్లీకూతురు అదృశ్యం | mother and doughter Disappeared | Sakshi
Sakshi News home page

తల్లీకూతురు అదృశ్యం

Mar 24 2016 2:39 AM | Updated on Mar 28 2018 11:26 AM

తల్లీకూతురు అదృశ్యం - Sakshi

తల్లీకూతురు అదృశ్యం

ఓ వివాహిత తన కూతురితో కలిసి కనిపించకుండా పోయింది.

చేవెళ్ల రూరల్: ఓ వివాహిత తన కూతురితో కలిసి కనిపించకుండా పోయింది.  పోలీసుల కథనం ప్రకారం. చేవెళ్లకు చెందిన ఒగ్గు పాండు, శశికళ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కూతుళ్లు అశ్విని, ఆకాంక్ష (4) ఉన్నారు. ఇదిలా ఉండగా, ఈనెల 21న దంపతులు గొడవపడ్డారు. దీంతో మనస్తాపం చెందిన శశికళ తన  చిన్న కూతురిని తీసుకొని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. వారి కోసం కుటుంబీకులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. శశికళ వద్ద ఉన్న ఫోన్‌కు కాల్ చేయగా స్విఛాఫ్ వస్తోంది. దీంతో ఆందోళనకు గురైన శశికళ తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement