ఫ్యాక్షన్‌ రాజకీయాలకు ఆజ్యం పోస్తున్న సీఎం | mlc vennapusa gopalreddy comment on narayanareddy murder | Sakshi
Sakshi News home page

ఫ్యాక్షన్‌ రాజకీయాలకు ఆజ్యం పోస్తున్న సీఎం

May 22 2017 12:27 AM | Updated on May 29 2018 6:47 PM

రాష్ట్రంలో కొన్నేళ్లుగా సమసిపోయిన ఫ్యాక్షన్‌ రాజకీయాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి ఆజ్యం పోస్తున్నారని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు.

అనంతపురం : రాష్ట్రంలో కొన్నేళ్లుగా సమసిపోయిన ఫ్యాక్షన్‌ రాజకీయాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి ఆజ్యం పోస్తున్నారని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ ðవైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు. పత్తికొండలో తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్న నారాయణరెడ్డిని రానున్న ఎన్నికల్లో ఎదుర్కోలేక మట్టు పెట్టారన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి కేఈ కృష్ణమూర్తి ఇందుకు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రకాశం జిల్లాలో ఇటీవల జరిగిన జంటహత్యల వెనుక గొట్టిపాటి రవికుమార్‌ ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు ఎదురు ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఇలాంటి నీచ రాజకీయాలకు తెర తీస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement