ఘనంగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి జన్మదిన వేడుకలు | MLA Ravindranath Reddy, Birthday celebrations | Sakshi
Sakshi News home page

ఘనంగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి జన్మదిన వేడుకలు

Aug 21 2017 2:30 AM | Updated on May 25 2018 9:20 PM

ఘనంగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి జన్మదిన వేడుకలు - Sakshi

ఘనంగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి జన్మదిన వేడుకలు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, కమలాపురం ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి జన్మదిన

కడప కార్పొరేషన్‌ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, కమలాపురం ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి జన్మదిన వేడుకలు కడప నగరంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం స్థానిక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో యువజన విభాగం నగర అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి సన్‌రైజ్‌ హాస్పిటల్‌ ఎండీ డాక్టర్‌ విజయ్‌భాస్కర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవీంద్రనాథ్‌రెడ్డి ఇలాంటి జన్మదినాలు మరెన్నో నిర్వహించుకోవాలని, రాజకీయాల్లో ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.

సంధ్యా సర్కిల్‌లో...కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి జన్మదినం సందర్భంగా స్థానిక సంధ్యా సర్కిల్‌లో వైఎస్‌ఆర్‌సీపీ  ఎస్సీసెల్‌ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వల్లూరు జెడ్పీటీసీ అబ్బిరెడ్డిగారి వీరారెడ్డి, సన్‌రైజ్‌ హాస్పిటల్‌ ఎండీ విజయ్‌భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే సతీమణి అరుణమ్మలు హాజరై కేక్‌ కట్‌ చేశారు.

ఎన్‌ఆర్‌ఐల శుభాకాంక్షలు
పుట్టిన రోజు సందర్భంగా కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డికి వైఎస్‌ఆర్‌సీపీ గల్ఫ్‌ కన్వీనర్‌ బీహెచ్‌ ఇలియాస్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఐలు శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనకు వారు పూలమాలలు వేసి, పుష్ఫగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు బి. నిత్యానందరెడ్డి, బాబు, డిష్‌ జిలాన్, జీఎస్‌ బాబూరాయుడు, జరుగు రాజశేఖర్‌రెడ్డి, కరిముల్లా, పసుపులేటి మనోజ్‌ పాల్గొన్నారు.

చౌడమ్మ వృద్ధాశ్రమంలో...
కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంధ్రనాథ రెడ్డి 57వ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. నగరానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు యం. చంద్రశేఖర్‌ రెడ్డి, 9వ డివిజన్‌ ఇన్‌చార్జ్‌ మల్లికార్జున, కిరణ్‌ సబ్‌జైల్‌ సమీపంలో చౌడమ్మ వృద్ధాశ్రమంలో వృద్ధులకు చీరలను పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement