మొయినాబాద్‌ను తూర్పులో కలపాలి | mix moinabad in east RR Dt | Sakshi
Sakshi News home page

మొయినాబాద్‌ను తూర్పులో కలపాలి

Jul 22 2016 5:09 PM | Updated on Mar 28 2018 11:26 AM

మొయినాబాద్‌ను తూర్పులో కలపాలి - Sakshi

మొయినాబాద్‌ను తూర్పులో కలపాలి

మండలాన్ని వికారాబాద్‌ కేంద్రంగా ఏర్పాటయ్యే పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో కాకుండా తూర్పు రంగారెడ్డిలో కలపాలని మండల అఖిలపక్షం నాయకులు డిమాండ్‌ చేశారు.

కొనసాగుతున్న సంతకాల సేకరణ
అఖిలపక్షం నాయకులు


మొయినాబాద్‌: మండలాన్ని వికారాబాద్‌ కేంద్రంగా ఏర్పాటయ్యే పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో కాకుండా తూర్పు రంగారెడ్డిలో కలపాలని మండల అఖిలపక్షం నాయకులు డిమాండ్‌ చేశారు. మండలాన్ని పశ్చిమ జిల్లాలో కాకుండా తూర్పుజిల్లాలో కలపాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో మండలంలోని వెంకటాపూర్‌, శ్రీరాంనగర్‌, సురంగల్‌ గ్రామాల్లో శుక్రవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ.. జిల్లాల పునర్విభజనలో ప్రభుత్వం మండల ప్రజల అభిప్రాయాన్ని తప్పకుండా తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌కు చేరువలో ఉన్న మొయినాబాద్‌ మండలాన్ని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్లో కలిపితే తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే అన్ని గ్రామాల్లో సంతకాల సేకరణ చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్‌వల్లి ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కొత్త నర్సింహారెడ్డి, బీజేపీ చేవెళ్ల నియోజకవర్గం కన్వీనర్‌ బి.జంగారెడ్డి,  టీడీపీ మండల అధ్యక్షుడు వెకంట్‌రెడ్డి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, సర్పంచ్‌ మేకల రాంచంద్రయ్య, ఎంపీటీసీ సభ్యులు మాధవరెడ్డి, పెంటయ్య, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ సిడిగిద్ద కృష్ణారెడ్డి, నాయకులు క్యామ పద్మనాభం, ప్రభాకర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, ఈగ రవీందర్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, లక్ష్మణ్‌, మెట్టు పెంటయ్య, వెంకటేష్‌, రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement