'60 ఏళ్ల దరిద్రం ఒక్కసారి పొమ్మంటే పోదు' | minister KTR criticises previous government rulers | Sakshi
Sakshi News home page

'60 ఏళ్ల దరిద్రం ఒక్కసారి పొమ్మంటే పోదు'

Aug 20 2015 4:49 PM | Updated on Aug 30 2019 8:24 PM

'60 ఏళ్ల దరిద్రం ఒక్కసారి పొమ్మంటే పోదు' - Sakshi

'60 ఏళ్ల దరిద్రం ఒక్కసారి పొమ్మంటే పోదు'

60 ఏళ్ల దరిద్రం ఒక్కసారి పొమ్మంటే పోయేది కాదని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు.

నిజామాబాద్ : 60 ఏళ్ల దరిద్రం ఒక్కసారి పొమ్మంటే పోయేది కాదని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు. నిజామాబాద్ జిల్లాలో గురువారం నాడు ఆయన పర్యటిస్తున్నారు. జిల్లాలోని పిట్లం మండలం కుర్తి గ్రామంలో గ్రామజ్యోతి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వాల పాలకులపై విమర్శలు గుప్పించారు. గత పాలకులు చేసిన పాపాలు మేం కడుగుతున్నామంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫౌండేషన్ ద్వారా కుర్తి గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement