రైలు ప్రమాదంలో ఎంబీఏ విద్యార్థిని మృతి | mba student deid in train accident | Sakshi
Sakshi News home page

రైలు ప్రమాదంలో ఎంబీఏ విద్యార్థిని మృతి

Aug 26 2016 11:23 PM | Updated on Oct 16 2018 2:53 PM

మంచిర్యాల రాంగనర్‌లో నివాసం ఉంటున్న నగునూరి శివాని(22) అనే ఎంబీఏ విద్యార్థిని రైలు ప్రమాదంలో మృతి చెందింది. రైల్వే ఎసై ్స మునీరుల్లా కథనం ప్రకారం చెన్నూర్‌లోని తమ్మళ్లవాడకు చెందిన నగునూరి శంకర్‌ మంచిర్యాల రాంనగర్‌లో కొద్ది రోజులుగా నివాసం ఉంటున్నాడు.

మంచిర్యాల రూరల్‌ : మంచిర్యాల రాంగనర్‌లో నివాసం ఉంటున్న నగునూరి శివాని(22) అనే ఎంబీఏ విద్యార్థిని రైలు ప్రమాదంలో మృతి చెందింది. రైల్వే ఎసై ్స మునీరుల్లా కథనం ప్రకారం చెన్నూర్‌లోని తమ్మళ్లవాడకు చెందిన నగునూరి శంకర్‌ మంచిర్యాల రాంనగర్‌లో కొద్ది రోజులుగా నివాసం ఉంటున్నాడు. శంకర్‌ కూతురు అయిన శివాని(22) హైదరాబాద్‌లోని తీగల కృష్ణారెడ్డి ఎంబీఏ కళాశాలలో చదువుతోంది. శుక్రవారం మంచిర్యాల నుంచి కాలేజీకి వెళ్లేందుకు మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కింది. ఈ ప్రయాణంలో పెద్దంపేట వరకు వెళ్లగా ప్రమాదవశాత్తు శివాని రైల్లోంచి కిందపడింది. ఈ ప్రమాదంలో శివాని తలకు, శరీర భాగాలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి శంకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై ్స తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement