మార్కుల జాబితాల పంపిణీ | marks lists distributes | Sakshi
Sakshi News home page

మార్కుల జాబితాల పంపిణీ

Sep 28 2016 10:59 PM | Updated on Sep 4 2017 3:24 PM

మార్కుల జాబితాల పంపిణీ

మార్కుల జాబితాల పంపిణీ

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి మార్కుల జాబితాలను ఆయా కళాశాలలకు బుధవారం పంపిణీ చేశారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ :  మార్చిలో జరిగిన పరీక్షల్లో 20,179 మంది జనరల్‌ విద్యార్థులు, 1550 మంది ఒకేషనల్‌ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అలాగే జూన్‌లో జరిగిన సప్లిమెంటరీ పరీక్షల్లో 4364 మంది జనరల్‌ విద్యార్థులు, 216 మంది ఒకేషనల్‌ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరందరీ మార్కుల జాబితాలు బోర్డు నుంచి ఆర్‌ఐఓ కార్యాలయానికి వచ్చాయి.

జిల్లాలోని  అన్ని యాజమాన్యాల కింద పని చేస్తున్న 204 కళాశాలలకు గాను సుమారు 70 శాతానికి పైగా బుధవారం తీసుకెళ్లారు. తక్కిన వారు వెంటనే వచ్చి మార్కుల జాబితాలు తీసుకెళ్లాలని ఆర్‌ఐఓ  వెంకటేశులు సూచించారు. 

Advertisement
 
Advertisement
Advertisement