ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య | Intermediate student dies by suicide in Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

May 25 2026 6:09 AM | Updated on May 25 2026 6:09 AM

Intermediate student dies by suicide in Andhra pradesh

విశాఖలో హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్న విద్యార్థిని 

కొమ్మాది (విశాఖ): గ్రేటర్‌ విశాఖలోని 4వ వార్డు కాపులుప్పాడలో ఉన్నఓ కార్పొరేట్‌ కళాశాలలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా హౌసింగ్‌ బోర్డ్‌ (వుడా) కాలనీకి చెందిన నడుమూరు జ్యోత్స్న (17) ఇంటర్‌ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇటీవల విడుదలైన ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఆమె 450కి పైగా మార్కులు సాధించి, ప్రస్తుతం బెటర్‌మెంట్‌ పరీక్షలకు సిద్ధమవుతోంది.

శనివారం తోటి విద్యార్థినులతో సరదాగానే గడిపిన జ్యోత్స్న, రాత్రి వేరే గదిలోకి వెళ్లి బెడ్‌షిట్‌తో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఆదివారం ఉదయం తోటి విద్యార్థినులు గమనించి యాజమాన్యానికి తెలపడంతో, ఆమెను మారికవలసలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థిని తండ్రి జగన్మోహన్‌రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement