ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి | maoist dead | Sakshi
Sakshi News home page

ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి

Oct 18 2016 9:44 PM | Updated on Oct 9 2018 2:49 PM

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా, కుంటలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలం తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండల సరిహద్దులకు సమీపంలో ఉంది. కుంటలో తమ టార్గెట్‌లో ఉన్న వ్యక్తులను హతమార్చేందుకు మావోయిస్టులు పథకం రచించినట్టు పోలీసులకు సమాచారం తెలిసింది. దీంతో కుంటలోని నయాపారా రహదారిలోని బెర్జి బేస్‌ క్యాంపు వద్ద వారు మాటువేసి అటుగా వచ్చిన మావోయిస్టులతో ఎదు

చింతూరు :
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా, కుంటలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలం తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండల సరిహద్దులకు సమీపంలో ఉంది. కుంటలో తమ టార్గెట్‌లో ఉన్న వ్యక్తులను హతమార్చేందుకు మావోయిస్టులు పథకం రచించినట్టు పోలీసులకు సమాచారం తెలిసింది. దీంతో కుంటలోని నయాపారా రహదారిలోని బెర్జి బేస్‌ క్యాంపు వద్ద వారు మాటువేసి అటుగా వచ్చిన మావోయిస్టులతో ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా సంఘటనా స్థలంలో నాటు తుపాకీ, 12 బోరు తుపాకీ లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement