మంగళంపల్లి అస్థికలు గోదావరిలో నిమజ్జనం | mangalam palli asthikalu godavarilo nimmajanam | Sakshi
Sakshi News home page

మంగళంపల్లి అస్థికలు గోదావరిలో నిమజ్జనం

Nov 28 2016 11:42 PM | Updated on Sep 4 2017 9:21 PM

మంగళంపల్లి అస్థికలు గోదావరిలో నిమజ్జనం

మంగళంపల్లి అస్థికలు గోదావరిలో నిమజ్జనం

బాలమురళీకృష్ణ అస్థికలను ఆయన తనయులు సోమవారం గోదావరిలో నిమజ్జనం చేశారు.

కొవ్వూరు:
ఇటీవల మృతి చెందిన ప్రముఖ సంగీత విద్యాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ అస్థికలను ఆయన తనయులు సోమవారం గోదావరిలో నిమజ్జనం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రం రేవులో బాలమురళి ముగ్గురు తనయులు అభిరామ్, సుధాకర్, వంశీమోహన్‌ పితృకార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం అస్థికలను గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. అంతకు ముందు రాజమహేంద్రవరంలోని కోటిలింగాల రేవులోనూ ఈ కార్యక్రమాలు జరిపించారు. వారివెంట కొవ్వూరు పట్టణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అనుపిండి చక్రధరరావు ఉన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement