ప్రేమించి పెళ్లి చేసుకున్న సహచరి తనను విడిచి శాశ్వతంగా వెళ్లిపోవడంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.
రాయదుర్గం: ప్రేమించి పెళ్లి చేసుకున్న సహచరి తనను విడిచి శాశ్వతంగా వెళ్లిపోవడంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కాశీపురం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.
వివరాలు.. గ్రామానికి చెందిన ప్రసాద్ (22) అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రసాద్ భార్య శిరీష కడుపునొప్పి తాళలేక ఈ నెల 9న ఆత్మహత్య చేసుకుంది. వీరు ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. శిరీష మృతిని జీర్ణించుకోలేక ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.