కీసరలో వ్యక్తి దారుణ హత్య
కీసర: రంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కీసర మండలం తిమ్మాయిపల్లి వద్ద మృతదేహాన్ని గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు తిమ్మాయిపల్లిలోని శ్రీ బాలాజీ మెటల్ ఇండస్ట్రీస్ యజమాని కృష్ణమోహన్ రావు(45)గా గుర్తించారు. తలపై రాడ్‌తో కొట్టిడం వల్ల చనిపోయినట్లు తెలుస్తుంది. అనంతరం శవాన్ని రోడ్డు పక్కన పడేసి దుండగులు పరారయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి