వడదెబ్బకు ఒకరి మృతి | man dies of sun strokes | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు ఒకరి మృతి

May 9 2017 11:14 PM | Updated on Sep 5 2017 10:46 AM

గుత్తిలో వడదెబ్బకు మరొకరు బలయ్యారు. స్థానిక బండగేరిలో నివాసముంటున్న ఆర్‌.బి.రామకృష్ణ(46) అనే టైలర్‌ వడదెబ్బకు గురై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

గుత్తి : గుత్తిలో వడదెబ్బకు మరొకరు బలయ్యారు. స్థానిక బండగేరిలో నివాసముంటున్న ఆర్‌.బి.రామకృష్ణ(46) అనే టైలర్‌ వడదెబ్బకు గురై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. సొంత పనిపై రెండ్రోజుల పాటు ఎండలో తిరిగిన ఆయన సోమవారం సాయంత్రం ఇంటి వద్ద ఉన్నపళంగా కుప్పకూలిపోయారు. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. తర్వాత ఇంటికి పిల్చుకెళ్లారు. అయితే మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటిలోనే  మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement