డెంగీ జ్వరంతో వ్యక్తి మృతి | man dies of dengue | Sakshi
Sakshi News home page

డెంగీ జ్వరంతో వ్యక్తి మృతి

Jul 28 2016 10:24 PM | Updated on Sep 4 2017 6:46 AM

మండలంలోని మణేసముద్రం గ్రామానికి చెందిన నరసింహులు (27) డెంగీ జ్వరంతో గురువారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

హిందూపురం అర్బన్‌ : మండలంలోని మణేసముద్రం గ్రామానికి చెందిన నరసింహులు (27) డెంగీ జ్వరంతో గురువారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. రోజువారీ కూలీ పనులు చేసే నరసింహులు కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో వైద్యం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు.

పరిస్థితి విషమించటంతో డెంగీ జ్వరం వచ్చిందని వెంటనే అనంతపురం తరలించాలని స్థానిక వైద్యులు సూచించారు. ఈ మేరకు అంబులెన్స్‌లో అనంతపురం తరలిస్తుండగా మార్గంమధ్యలోనే చనిపోయాడని కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement