రైలు ఢీకొని వ్యక్తి మృతి | man died with train struck | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని వ్యక్తి మృతి

Sep 12 2016 8:38 PM | Updated on Sep 28 2018 3:41 PM

రైలు ఢీకొని వ్యక్తి మృతి - Sakshi

రైలు ఢీకొని వ్యక్తి మృతి

బీబీనగర్‌: రైలు ఢీకొన ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని కొండమడుగు మెట్టు వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

బీబీనగర్‌:
రైలు ఢీకొన ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన  మండలంలోని కొండమడుగు మెట్టు వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గ్రామానికి చెందిన బోనస్‌ శివప్రసాద్‌(36) కుటంబ సభ్యులతో కలిసి కొండమడుగు మెట్టు వద్ద నివాసముంటున్నాడు. బతుకుదెరువు కోసం హమాలీ పని చేస్తున్న శివప్రసాద్‌ ఆదివారం రాత్రి మెట్టు సమీపంలోని రైలు పట్టాలను దాటుతున్నాడు. ఈక్రమంలో  గుర్తు తెలియని రైలు ఢీకొట్టి వెళ్లిపోయింది. స్థానికుల సమాచారం మేరకు సోమవారం ఘటన స్థలాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement