సీబీఐ విచారణకు సిద్ధమేనా? | Mallu Bhatti Vikramarka takes on kcr govt | Sakshi
Sakshi News home page

సీబీఐ విచారణకు సిద్ధమేనా?

Jul 14 2016 5:43 PM | Updated on Oct 8 2018 9:21 PM

ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి చోటుచేసుకుందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.

ఖమ్మం : ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి చోటుచేసుకుందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆరోపించారు. గురువారం ఖమ్మం జిల్లా మధిరలో భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరిట ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందన్నారు.

ఈ విషయంలో సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా ? అని ప్రశ్నించారు. అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడుతుందని భట్టి విక్రమార్క తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement