చీమకుర్తిలో లారీ బీభత్సం | lorry hulchul in cheemakurthi | Sakshi
Sakshi News home page

చీమకుర్తిలో లారీ బీభత్సం

Jul 22 2016 8:23 AM | Updated on Sep 4 2017 5:51 AM

ప్రకాశం జిల్లా చీమకుర్తిలో శుక్రవారం లారీ బీభత్సం సృష్టించింది.

ఒంగోలు : ప్రకాశం జిల్లా చీమకుర్తిలో శుక్రవారం లారీ బీభత్సం సృష్టించింది. రహదారిపై వెళ్తున్న నలుగురిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా... మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement