బైక్‌ను ఢీకొన్న లారీ | lorry hit bike | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న లారీ

Jul 21 2016 6:19 PM | Updated on Sep 18 2019 3:26 PM

బైక్‌ను ఢీకొన్న లారీ - Sakshi

బైక్‌ను ఢీకొన్న లారీ

బైక్‌ను టిప్పర్ ఢీకొట్టిన సంఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ధారూరు మండలం అంపల్లి సమీపంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.

యువకుడికి తీవ్రగాయాలు

ధారూరు: బైక్‌ను టిప్పర్ ఢీకొట్టిన సంఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ధారూరు మండలం అంపల్లి సమీపంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ సంగమేశ్వర్‌, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుదోట్ల గ్రామానికి చెందిన కొంకలి అనంతయ్య(26) పని నిమిత్తం బైక్‌పై ధారూరుకు వచ్చి తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో అంపల్లి గ్రామ సమీపంలోని పౌల్ట్రీఫారం దగ్గర కంకర బూడిదను ఖాళీ చేసి వస్తున్న ఓ  టిప్పర్ బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌ టిప్పర్‌ వెనక టైర్‌ దగ్గర ఇరుక్కుపోయింది. బైక్‌పై ఉన్న అనంతయ్య తలకు, ఇతర భాగాలకు తీవ్రగాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబీకులు అతడిని వెంటనే ఓ ప్రైవేటు వాహనంలో తాండూర్‌లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే, అనంతయ్యకు మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌ మండలం ఈర్లపల్లికి చెందిన ఓ యువతితో ఆగస్టు 11న వివాహం నిశ్చయించారు. అంతలోనే ప్రమాదం జరగడంతో క్షతగాత్రుడి తల్లిదండ్రులు, కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. టిప్పర్ డ్రైవర్‌ బాలయ్య నిర్లక్ష్యమే ప్రమాదం జరిగిందని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను పట్టుబట్టారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement