రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతి | lorry driver dies of road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతి

Jul 29 2017 9:39 PM | Updated on Aug 30 2018 4:10 PM

రోడ్డు ప్రమాదంలో సుధాకర్‌ (20) అనే లారీ డ్రైవర్‌ మృతి చెందాడు.

ధర్మవరం టౌన్: రోడ్డు ప్రమాదంలో సుధాకర్‌ (20) అనే  లారీ డ్రైవర్‌ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్‌కు చెందిన లారీడ్రైవర్‌ సుధాకర్‌ శనివారం ధర్మవరం నుంచి సిమెంటు లోడుతో బెంగుళూర్‌కు బయల్దేరాడు. పట్టణ శివారు ప్రాంతంలోని ఎల్‌సీకేపురం రహదారి వద్ద డ్రైవర్‌ కునుకు తీయడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. క్లీనర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. డ్రైవర్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement