మా‘నీటి’ పరవళ్లు.. | LMD gates opend | Sakshi
Sakshi News home page

మా‘నీటి’ పరవళ్లు..

Sep 30 2016 11:08 PM | Updated on Sep 4 2017 3:39 PM

మా‘నీటి’ పరవళ్లు..

మా‘నీటి’ పరవళ్లు..

జిల్లాలోని ఎగువ, దిగువ మానేరు ప్రాజెక్టులు పరవళ్లు తొక్కుతున్నాయి. పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. కరీంనగర్‌ శివారులోని ఎల్‌ఎండీ(దిగువ మానేరు) గేట్లు ఎత్తడంతో నీటి ప్రవాహాన్ని చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు.

జిల్లాలోని ఎగువ, దిగువ మానేరు ప్రాజెక్టులు పరవళ్లు తొక్కుతున్నాయి. పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి.  కరీంనగర్‌ శివారులోని ఎల్‌ఎండీ(దిగువ మానేరు) గేట్లు ఎత్తడంతో నీటి ప్రవాహాన్ని చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. గురువారం రాత్రి మూడు గేట్లు ఎత్తిన అధికారులు శుక్రవారం 11 గేట్లు ఎత్తారు. దీంతో మా‘నీరు’ పరవళ్లను చూసేందుకు జిల్లా సహా రాష్ట్రంలోని నలుమూలల నుంచి జనం పిల్లాపాపలతో ఎల్‌ఎండీకి చేరుకుంటున్నారు. జలహారం అందాలు చూసి పరవశించిపోతున్నారు. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు వారం రోజులుగా పొంగిప్రవహిస్తోంది. పర్యాటకులు మత్తడి పోస్తున్న ప్రాంతంలో జలకాలాడుతూ.. ప్రాజెక్టులో ఈత కొడుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. 
 – మానకొండూరు/గంభీరావుపేట
 
 

Advertisement
 
Advertisement
Advertisement