breaking news
inflow continued
-
ఈక్విటీ ఎంఎఫ్లకు ఫిబ్రవరిలో రూ.26,866 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్)లోకి ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.26,866 కోట్ల పెట్టుబడులు వచ్చాయని భారత మ్యూచువల్ ఫండ్ల సంఘం (యాంఫీ) గణాంకాలు వెల్లడించాయి. ఒక నెలలో ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం గడిచిన 23 ఏళ్లలో గరిష్టం. ఈ జనవరిలో వెల్లువెత్తిన రూ.21,721 కోట్లతో పోలిస్తే కూడా 23% అధికం. కొత్త ఫండ్ల ఆవిష్కరణ, థీమాటిక్/సెక్టోరియల్ ఫండ్లపై ఆసక్తి ఇందుకు ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) పథకాల్లోకి కూడా ఫిబ్రవరి జీవితకాల గరిష్టం రూ.19,186 కోట్లకు చేరాయి. జనవరి ఇవి రూ.18,838 కోట్లుగా ఉన్నాయి. -
జూరాలకు భారీ వరద
గద్వాల టౌన్: ఎగువన ఉన్న మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. మంగళవారం జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2.30 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 25 క్రస్టు గేట్లను ఎత్తి స్పిల్‌వే ద్వారా 2,28,146 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి, ఇతర కాల్వల ద్వారా దిగువ నదిలోకి 2,54,910 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. కృష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,45,424 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, దిగువ నదిలోకి 1,56,407 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2.30 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 10 క్రస్టు గేట్లను ఎత్తి దిగువ నదిలో కి 2,57,844 క్యూసెక్కుల వరదను విడుదల చే స్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు దిగువన ఉన్న జూరాలకు బుధవారం ఉదయానికి వరద స్థాయి మరింతగా పెరిగే అవకాశం ఉంది. తుంగభద్ర నదిలోనూ.. కృష్ణానదికి ఉపనది అయిన తుంగభద్ర నదిపై కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 100.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం100.83 టీఎంసీల నిల్వను కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,44,757 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ప్రాజెక్టులోని 33 క్రస్టు గేట్లను ఎత్తి దిగువ నదిలోకి 1.54 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నదిపై సుంకేసుల బ్యారేజీ వద్ద 1,16,536 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుంది. బ్యారేజీకి వరద మరింతగా పెరగనుంది. ఎత్తిపోతల పథకాలకు.. జూరాల ప్రాజెక్టు జలాశయం నుంచి ఎత్తిపోతల పథకాలకు పంపింగ్‌ను కొనసాగిస్తున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు, భీమా స్టేజీ–1కు 650, కోయిల్‌సాగర్‌కు 315, జూరాల కుడి ప్రధాన కాల్వకు 822, ఎడమ ప్రధాన కాల్వకు వెయ్యి, సమాంతర కాల్వకు 340 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జూరాల జలవిద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగిస్తూ 21,995 క్యూసెక్కులను వినియోగిస్తున్నారు. -
మా‘నీటి’ పరవళ్లు..
జిల్లాలోని ఎగువ, దిగువ మానేరు ప్రాజెక్టులు పరవళ్లు తొక్కుతున్నాయి. పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. కరీంనగర్ శివారులోని ఎల్ఎండీ(దిగువ మానేరు) గేట్లు ఎత్తడంతో నీటి ప్రవాహాన్ని చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. గురువారం రాత్రి మూడు గేట్లు ఎత్తిన అధికారులు శుక్రవారం 11 గేట్లు ఎత్తారు. దీంతో మా‘నీరు’ పరవళ్లను చూసేందుకు జిల్లా సహా రాష్ట్రంలోని నలుమూలల నుంచి జనం పిల్లాపాపలతో ఎల్ఎండీకి చేరుకుంటున్నారు. జలహారం అందాలు చూసి పరవశించిపోతున్నారు. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు వారం రోజులుగా పొంగిప్రవహిస్తోంది. పర్యాటకులు మత్తడి పోస్తున్న ప్రాంతంలో జలకాలాడుతూ.. ప్రాజెక్టులో ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. – మానకొండూరు/గంభీరావుపేట