ఈక్విటీ ఎంఎఫ్‌లకు ఫిబ్రవరిలో రూ.26,866 కోట్లు | Equity mutual funds in February saw a 23 per cent net rise in inflows to Rs 26,865.78 crore | Sakshi
Sakshi News home page

ఈక్విటీ ఎంఎఫ్‌లకు ఫిబ్రవరిలో రూ.26,866 కోట్లు

Mar 9 2024 2:31 AM | Updated on Mar 9 2024 2:31 AM

Equity mutual funds in February saw a 23 per cent net rise in inflows to Rs 26,865.78 crore - Sakshi

న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్ల (ఎంఎఫ్‌)లోకి ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.26,866 కోట్ల పెట్టుబడులు వచ్చాయని భారత మ్యూచువల్‌ ఫండ్‌ల సంఘం (యాంఫీ) గణాంకాలు వెల్లడించాయి. ఒక నెలలో ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం గడిచిన 23 ఏళ్లలో గరిష్టం.

ఈ జనవరిలో వెల్లువెత్తిన రూ.21,721 కోట్లతో పోలిస్తే కూడా 23% అధికం. కొత్త ఫండ్ల ఆవిష్కరణ, థీమాటిక్‌/సెక్టోరియల్‌ ఫండ్లపై ఆసక్తి ఇందుకు ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) పథకాల్లోకి కూడా ఫిబ్రవరి జీవితకాల గరిష్టం రూ.19,186 కోట్లకు చేరాయి. జనవరి ఇవి రూ.18,838 కోట్లుగా ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement