ఎల్కేజీ విద్యార్థినిపై ఆయాల కర్కశత్వం | LKG students punished by school employees | Sakshi
Sakshi News home page

ఎల్కేజీ విద్యార్థినిపై ఆయాల కర్కశత్వం

Oct 13 2015 11:28 AM | Updated on Sep 15 2018 4:26 PM

ఎల్కేజీ విద్యార్థినిపై ఆయాల కర్కశత్వం - Sakshi

ఎల్కేజీ విద్యార్థినిపై ఆయాల కర్కశత్వం

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని వెంకటాపురం పంచాయతీ బగ్గయ్యవారిపేటలోని హోప్ ఇంగ్లీషు మీడియం స్కూల్లో మంగళవారం దారుణం చోటు చేసుకుంది.

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని వెంకటాపురం పంచాయతీ బగ్గయ్యవారిపేటలోని హోప్ ఇంగ్లీషు మీడియం స్కూల్లో మంగళవారం దారుణం చోటు చేసుకుంది.  స్కూల్లో యూరిన్ పోసిందని ఆరోపిస్తూ ఎల్కేజీ విద్యార్థి జ్వాలశ్రీని ఆయాలు మండుటెండలో ఆట స్థలంలోని జారుడు బల్లపై కుర్చోబెట్టారు. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. సాయంత్రం ఇంటికి వెళ్లిన జ్వాలశ్రీని అనారోగ్యం పాలైంది.

దీంతో ఏమైందని ప్రశ్నించడంతో జ్వాలశ్రీ స్కూల్లో జరిగిన సంఘటనను తల్లిదండ్రులకు వివరించింది. దీంతో ఆగ్రహించిన వారు... మంగళవారం ఉదయం స్కూల్కు చేరుకుని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. పాప అస్వస్థతకు, తమకు ఎటువంటి సంబంధం లేదని స్కూల్ యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో ఆగ్రహించిన జ్వాలశ్రీ తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement