నలుగురు టీడీపీ నేతలకు జీవిత ఖైదు | Life imprisonment to four TDP leader | Sakshi
Sakshi News home page

నలుగురు టీడీపీ నేతలకు జీవిత ఖైదు

Oct 25 2016 1:33 AM | Updated on Aug 10 2018 8:23 PM

వైఎస్సార్ జిల్లా ముద్దునూరు మండలంలో ఫ్యాక్షన్ గ్రామంగా పోలీ సుల రికార్డులకెక్కిన గంగాదేవిపల్లెకు చెందిన టీడీపీ నేతలు(మాజీ మంత్రి పీఆర్ వర్గీయులు) వెన్నపూస

ముద్దనూరు: వైఎస్సార్ జిల్లా ముద్దునూరు మండలంలో ఫ్యాక్షన్ గ్రామంగా పోలీసుల రికార్డులకెక్కిన గంగాదేవిపల్లెకు చెందిన టీడీపీ నేతలు(మాజీ మంత్రి పీఆర్ వర్గీయులు) వెన్నపూస యుగంధర్‌రెడ్డి, వెన్నపూస గంగాధర్‌రెడ్డి, వెన్నపూస చిన్నరెడ్డి, వేమిరెడ్డి బాలచెన్నారెడ్డి అలియాస్ బాలుడులకు ఓ హత్యకేసులో ప్రొద్దుటూరు సెషన్స్ కోర్టు సోమవారం జీవిత ఖైదు విధించింది.

ముద్దనూరు మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన అప్పటి ఆప్కాబ్ డైరక్టర్, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనుచరుడైన పెద్దరెడ్డిని 2009 సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన గంగాదేవిపలె ్లచీనీ తోటలో ప్రత్యర్థులు హత్య చేశారు. ఈ హత్య కేసులో నిందితులైన 5 మందిలో నలుగురికి మేజిస్ట్రేట్ జీవితఖైదు విధించారు. మరో నిందితుడిపై కేసు కొట్టి వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement