కటకటాల్లో కామాంధులు | l Gang rape in tribal girl | Sakshi
Sakshi News home page

కటకటాల్లో కామాంధులు

Jun 23 2016 8:48 AM | Updated on Sep 4 2017 3:08 AM

కటకటాల్లో కామాంధులు

కటకటాల్లో కామాంధులు

సంచలనం సృష్టించిన గిరిజన విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురు కామాంధులను కటకటాల వెనక్కి...

అనంతపురం: సంచలనం సృష్టించిన గిరిజన విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురు కామాంధులను కటకటాల వెనక్కి పంపినట్లు అనంతపురం డీ ఎస్పీ మల్లికార్జునవర్మ బుధవారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. కళ్యాణదుర్గం మండలానికి చెందిన ఓ విద్యార్థిని అనంతపురంలోని హాస్టల్‌లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆమె స్నేహితురాలిని రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన అమర్‌నాథ్‌రెడ్డి ప్రేమించాడు. ప్రేమికురాలి ద్వారా పరిచయమైన ఇంటర్ విద్యార్థినిని బైకులో వదిలిపెడతానంటూ పిల్చుకెళ్లిన అమర్‌నాథ్‌రెడ్డి ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

వాటిని వీడియో తీసి తాను చెప్పినట్లు వినకపోతే బయటపెడతానంటూ బెదిరిస్తూ తరచూ ఆమెపై స్నేహితులు వినోద్‌రెడ్డి, కార్తీక్‌తో కలసి అతను కోరిక తీర్చుకునేవాడు. ఈ క్రమంలో మంగళవారం అదే ప్రాంతానికి బాలికను పిలుచుకెళ్లారు. అప్పటికే  బాధితురాలి ద్వారా సమాచారం అందుకున్న త్రీటౌన్ సీఐ గోరంట్ల మాధవ్ సిబ్బందితో వెళ్లి నిందితులను పట్టుకున్నారు. గిరిజన బాలిక కావడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement