కేయూ వీసీకి ఫెలో పురస్కారం | ku V.C. gets Fellow puraskaram | Sakshi
Sakshi News home page

కేయూ వీసీకి ఫెలో పురస్కారం

Nov 10 2016 10:08 PM | Updated on Sep 4 2017 7:44 PM

కేయూ వీసీకి ఫెలో పురస్కారం

కేయూ వీసీకి ఫెలో పురస్కారం

ఆంధ్రప్రదేశ్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో సైన్స్, టెక్నాలజీలో విశేష పరిశోధనలు జరిపిన కృష్ణా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ సుంకరి రామకృష్ణారావుకు ఫెలో ఆఫ్‌ ఎ.పి.ఎ.ఎస్‌ పురస్కారాన్ని అందజేశారు.

మచిలీపట్నం : ఆంధ్రప్రదేశ్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో సైన్స్, టెక్నాలజీలో విశేష పరిశోధనలు జరిపిన కృష్ణా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ సుంకరి రామకృష్ణారావుకు ఫెలో ఆఫ్‌ ఎ.పి.ఎ.ఎస్‌ పురస్కారాన్ని అందజేశారు. అకాడమీ ఆఫ్‌ సైన్సెన్‌ ఆధ్వర్యంలో ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు విజయవాడలోని పీబి సిద్ధార్థ కళాశాలలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ సైన్స్‌ కాంగ్రెస్‌–2016 కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. విశ్వవిద్యాలయం వీసీతో పాటు రసాయన శాస్త్ర విభాగాధిపతి డి.రామశేఖరరెడ్డి, బయో టెక్నాలజీ విభాగాధిపతి పీ.వి బ్రహ్మచారీలకు అసోసియేట్‌ ఫెలో ఆఫ్‌ ఎ.పి.ఎ.ఎస్‌ పురస్కారాన్ని అందజేశారు. వీరిని విశ్వవిద్యాలయ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.



 

Advertisement
 
Advertisement
Advertisement