ఆటో కిందపడి బాలుడి మృతి | kid died with an auto driver careless | Sakshi
Sakshi News home page

ఆటో కిందపడి బాలుడి మృతి

Oct 6 2016 4:25 PM | Updated on Aug 30 2018 4:10 PM

ఆటో కిందపడి ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు.

పాపన్నపేట: ఆటో కిందపడి ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుట్టి నాగరాజు(6) ఇంటి ముందు నిలిచి ఉన్న ఆటో వద్ద ఆడుకుంటున్నాడు. ఇది గమనించని డ్రైవర్ ఒక్కసారిగా ఆటోను రివర్స్ తీశాడు. దీంతో బాలుడు ఆటో వెనుక చక్రం కిందపడి మృతిచెందాడు. బాలుడి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement