కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం | KCR map ksirabhisekam | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

Aug 3 2016 5:20 PM | Updated on Sep 4 2017 7:40 AM

కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం (సెర్ఫ్‌), ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న ఉద్యోగుల వేతనాల పెంపును హర్షిస్తూ ఐకేపీ మండల సమాఖ్య క్లస్టర్‌ కో ఆర్డినేటర్లు సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి బుధవారం మిరుదొడ్డిలో క్షీరాభిషేకం చేశారు.

మిరుదొడ్డి: గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం (సెర్ఫ్‌), ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న ఉద్యోగుల వేతనాల పెంపును హర్షిస్తూ ఐకేపీ మండల సమాఖ్య క్లస్టర్‌ కో ఆర్డినేటర్లు సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి బుధవారం మిరుదొడ్డిలో క్షీరాభిషేకం చేశారు. ఒకరికొకరు స్వీట్లు పంచి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల సమాఖ్య క్లస్టర్‌ కో ఆర్డినేటర్ల వేతనం రూ. 6,150 నుండి, రూ. 12, వేలకు పెరగనుందన్నారు. వేతనాల పెంపునకు ఆమోదం తెలిపిన సీఎం కేసీఆర్‌కు, మంత్రులు జూపల్లి కృష్ణారావు, హరీష్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం  కృష్ణారెడ్డి, సీసీలు బాల్‌రాజ్‌ గౌడ్‌, ప్రభాకర్‌, సిద్ధిరాములు, వైకుంఠం, ప్రవీణ్‌, నాగరాజు, మణెమ్మ, ఎండీ. అక్బర్‌ పాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement