ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది | k.laxman fired on cm kcr and he's govt | Sakshi
Sakshi News home page

ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది

Jun 9 2016 3:15 AM | Updated on Jul 29 2019 2:51 PM

ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది - Sakshi

ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అందుకే టీజేఏసీ చైర్మన్ కోదండరాం ప్రశ్నించారని..

కోదండరాంపై రాజకీయ దాడి తగదు: కె.లక్ష్మణ్
సూర్యాపేట: ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అందుకే టీజేఏసీ చైర్మన్ కోదండరాం ప్రశ్నించారని, దాంట్లో  తప్పేమీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం వచ్చిన ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ తెచ్చుకున్నది ప్రజలను ముంచేందుకా? అని కోదండరాం ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో తప్పేమీ లేదన్నారు. రాజకీయ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే కోదండరాంపై మంత్రులు ప్రతి విమర్శలకు దిగుతున్నారన్నారు. కోదండరాంపై టీఆర్‌ఎస్ ముప్పేట దాడి చేయడం సిగ్గు చేటన్నారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement