రైతులను బెదిరించ వద్దు : కె.కన్నబాబు | k kanna babu takes on tdp govt | Sakshi
Sakshi News home page

రైతులను బెదిరించ వద్దు : కె.కన్నబాబు

Jul 3 2016 1:02 PM | Updated on Aug 10 2018 6:21 PM

రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుసాల కన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

కాకినాడ : రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుసాల కన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ పుణ్యమా అని రైతులకు పరపతి పోయిందన్నారు. ఆదివారం కాకినాడలో కె. కన్నబాబు విలేకర్లతో మాట్లాడుతూ... కోనసీమలో క్రాఫ్ హాలిడే ప్రకటించిన రైతులను బెదిరించ వద్దని ప్రభుత్వానికి సూచించారు.

హోంమంత్రి చినరాజప్ప పోలీసులను సదరు ప్రాంతానికి పంపి రైతులను బెదిరిస్తున్నారని విమర్శించారు. పంట విరామం చేయాలని తాము కోరుకోవడం లేదని..  ఆ దుస్థితి రాకూడదన్నారు. రైతుల ఆందోళన చేస్తే తమ పార్టీ మద్దతిస్తుందని కన్నబాబు స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement