తృటిలో తప్పిన ప్రమాదం | just escape | Sakshi
Sakshi News home page

తృటిలో తప్పిన ప్రమాదం

Aug 7 2016 1:36 AM | Updated on Sep 4 2017 8:09 AM

ఆకివీడు : ఏలూరు నుంచి భీమవరం వెళుతున్న ఏలూరు డిపో బస్సు ముందు చక్రం టైరు ఆకివీడు ప్రధాన సెంటర్‌లో శనివారం హఠాత్తుగా పేలిపోయింది.

ఆకివీడు : ఏలూరు నుంచి భీమవరం వెళుతున్న ఏలూరు డిపో బస్సు ముందు చక్రం టైరు ఆకివీడు ప్రధాన సెంటర్‌లో శనివారం హఠాత్తుగా పేలిపోయింది. ఆ సమయంలో బస్సు వేగం తగ్గడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు, డ్రైవర్‌ అన్నారు. బస్సులో 54 మంది ప్రయాణిస్తున్నారు. ఊరు శివారు ప్రాంతంలో టైర్‌ పేలి ఉంటే బస్సు అదుపు తప్పి పెనుప్రమాదం సంభవించేదని వారు ఆందోళన చెందారు. బస్సు పూర్తి కండీషన్‌ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని ప్రయాణికులు అన్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement