breaking news
tyre burstred
-
Azerbaijan Grand Prix: వెర్‌స్టాపెన్‌కు కలిసిరాని అదృష్టం
బాకు (అజర్బైజాన్): ఈ సీజన్లో మూడో విజయం ఖాయమనుకుంటున్న దశలో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్‌కు అదృష్టం కలిసి రాలేదు. అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలవాల్సిన అతను ఒక్క పాయింట్ కూడా సంపాదించకుండా రేసు నుంచి వైదొలగాల్సి వచ్చింది. అజర్బైజాన్ రాజధాని బాకు నగర వీధుల్లో జరిగిన 51 ల్యాప్‌ల రేసులో వెర్స్టాపెన్ 46వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉన్నాడు. సర్క్యూట్‌పై రయ్ రయ్‌మంటూ దూసుకుపోతున్న దశలో వెర్స్టాపెన్ కారు ఎడమ టైరు పంక్చర్ అయింది. దాంతో నియంత్రణ కోల్పోయిన వెర్స్టాపెన్ కారు కాంక్రీట్ గోడకు బలంగా ఢీ కొట్టింది. ఫలితంగా వెర్స్టాపెన్ కారు నుంచి బయటకు వచ్చి రేసు నుంచి వైదొలిగాడు. వెర్స్టాపెన్ ఘటన తర్వాత రేసును అరగంటపాటు ఆపారు .ఆ తర్వాత సేఫ్టీ కార్ల నడుమ రేసును మళ్లీ కొనసాగించగా... రెడ్‌బుల్ జట్టుకే చెందిన సెర్గియో పెరెజ్ విజేతగా అవతరించాడు. దాంతో వెర్స్టాపెన్ ఘటనతో నిరాశలో ఉన్న రెడ్‌బుల్ బృందంలో ఆనందం వెల్లివెరిసింది. ఆరో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన పెరెజ్ అందరికంటే ముందుగా 2 గంటల 13 నిమిషాల 36.410 సెకన్లలో లక్ష్యానికి చేరి విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో పెరెజ్‌కిది తొలి విజయం కాగా కెరీర్లో రెండోది. ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఆస్టన్ మార్టిన్) రెండో స్థానంలో... పియరీ గ్యాస్లీ (ఆల్ఫా టారీ) మూడో స్థానంలో నిలిచారు. పోల్ పొజిషన్ నుంచి రేస్‌ను ఆరంభించిన ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రపంచ చాంపియన్ హామిల్టన్ (మెర్సిడెస్) 15వ స్థానంలో నిలిచాడు. సీజన్‌లోని తదుపరి రేసు ఫ్రాన్స్ గ్రాండ్‌ప్రి ఈనెల 20న జరుగుతుంది. సీజన్లో ఐదు రేసులు ముగిశాక డ్రైవర్స్ చాంపియన్ షిప్ టైటిల్ పాయింట్ల పట్టికలో వెర్స్టాపెన్ (105 పాయింట్లు), హామిల్టన్ (101 పాయింట్లు), పెరెజ్ (69 పాయింట్లు), లాండో నోరిస్ (66 పాయింట్లు) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. A message from the #AzerbaijanGP winner... sounds good right, @SChecoPerez? 😉🇲🇽 pic.twitter.com/fRiGgVZIdR — Red Bull Racing Honda (@redbullracing) June 6, 2021 -
టైర్ పగిలి అదుపు తప్పిన కారు
బాలానగర్ (జడ్చర్ల) మహబూబ్ నగర్ : వేగంగా దూసుకెళ్తున్న ఓ కారు టైరు పగిలి మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని పెద్దాయపల్లి గ్రామ శివారులో సోమవారం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఏఎస్ఐ గోపాల్ కథనం ప్రకారం.. కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు కుడి వైపు ముందుటైర్ పగిలి డివైడర్ పైనుంచి హైదరాబాద్ నుంచి బెంగుళూరు వైపు వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారులో శ్రీకాంత్(33) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. హైదరాబాద్ వైపు బెంగుళూరు వైపు వెళ్తున్న కారులో తగరం దేవన్న, విఠల్ తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాంత్‌ది కర్నూలు జిల్లా జవహారపురం స్వగ్రామం. దేవన్న, విఠల్‌లు హైదరాబాద్‌కు చెందినవారు. గాయపడిన వారిని జీఎంఆర్ అంబులెన్స్‌లో షా ద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంత రం శ్రీకాంత్ మృతదేహానికి షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
తృటిలో తప్పిన ప్రమాదం
ఆకివీడు : ఏలూరు నుంచి భీమవరం వెళుతున్న ఏలూరు డిపో బస్సు ముందు చక్రం టైరు ఆకివీడు ప్రధాన సెంటర్లో శనివారం హఠాత్తుగా పేలిపోయింది. ఆ సమయంలో బస్సు వేగం తగ్గడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు, డ్రైవర్ అన్నారు. బస్సులో 54 మంది ప్రయాణిస్తున్నారు. ఊరు శివారు ప్రాంతంలో టైర్ పేలి ఉంటే బస్సు అదుపు తప్పి పెనుప్రమాదం సంభవించేదని వారు ఆందోళన చెందారు. బస్సు పూర్తి కండీషన్ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని ప్రయాణికులు అన్నారు.