వరంగల్ లో జర్నలిస్టుల ధర్నా | Journalists protest in Warangal | Sakshi
Sakshi News home page

వరంగల్ లో జర్నలిస్టుల ధర్నా

Aug 22 2016 5:35 PM | Updated on Sep 4 2017 10:24 AM

జర్నలిస్టుల సమస్యలపై టియుడబ్ల్యూజే(ఐజేయు) ఆద్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం జరిగింది.

జర్నలిస్టుల సమస్యలపై  టియుడబ్ల్యూజే(ఐజేయు) ఆద్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ కార్యాలయం ఎదుట వంటావార్పు చేసి జర్నలిస్టుల ధర్నా లో పాల్గొన్నరు ఈ కార్యక్రమనికి  టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు తుమ్మ శ్రీధర్ రెడ్డి  అధ్యక్షత వహించగా జాతీయ ,రాష్ట్ర నాయకులూ దాసరి కృష్ణారెడ్డి  వెంకటరమణ కుమారస్వామీ  పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా వందలాది మంది విలేఖరులు హాజరయ్యారు. జర్నలిస్టులు చేపట్టిన నిరసనకు కాంగ్రెస్ నాయకులు ఎర్రబెల్లి స్వర్ణ ,కట్ల శ్రీను  బిజేపి జిల్లా అద్యక్షులు  అశోక్ రెడ్డి టీడీపీ నాయకురాలు సీతక్క సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు శ్రీనివాసరావు  వాసుదేవరెడ్డిలు సంఘీభావం తెలిపారు. జీవో 239 ను సవరించి తక్షణమే అర్హులైన జర్నలిస్టులకు అందరికీ కొత్త అక్రిడిటేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టులందరికి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement