జీపు, బైక్‌ ఢీ: ఒకరి దుర్మరణం | Jeep, bike hit: one dead | Sakshi
Sakshi News home page

జీపు, బైక్‌ ఢీ: ఒకరి దుర్మరణం

Jul 26 2016 12:00 AM | Updated on Mar 28 2018 11:26 AM

జీపు, బైక్‌ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం

బషీరాబాద్‌: జీపు, బైక్‌ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎక్మాయి గ్రామానికి చెందిన సంతోష్‌గౌడ్‌ (35), తన స్నేహితుడు రవితో కలిసి సోమవారం రాత్రి బషీరాబాద్‌లోని మద్యం తాగి స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. బషీరాబాద్‌ రైల్వేగేట్‌ సమీపంలో తాండూరు నుంచి బషీరాబాద్‌కు వస్తున్న జీపు, వీరి బైక్‌ ఢీకొన్నాయి. సంతోష్‌గౌడ్‌ ఎగిరి కిందపడడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement