ఏజెన్సీలో ముమ్మర కూంబింగ్ | Intensive combing in Agency | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో ముమ్మర కూంబింగ్

Jun 28 2016 8:31 AM | Updated on Oct 9 2018 2:51 PM

కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతం పోలీస్ బూటు చప్పుళ్లతో సోమవారం దద్ధరిల్లింది.

విజయనగరం: కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతం పోలీస్ బూటు చప్పుళ్లతో సోమవారం దద్ధరిల్లింది. ఛత్తీస్‌గఢ్, ఖమ్మం, పాడేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్లకు నిరసనగా మావోరుుస్టులు ఆదివారం బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మావోరుుస్టులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నందున సీఆర్‌పీఎఫ్ సిబ్బంది రెండు రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. మక్కువ, పార్వతీపురం మండలాలతో పాటు ఒడిశా సరిహద్దు గ్రామాలను జల్లెడ పడుతున్నారు.
 
 ఏఓబీలో అగ్రనేతలు?

 ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామాల సమీపంలో మావోరుుస్టుల అగ్రనేతలు దయ, అరుణ, తాంబ్రేలు, తదితరులు సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా ఏఓబీ ప్రాంతంలో మావోయిస్టులు స్తబ్ధతగా ఉన్నప్పటికీ ఇటీవల క్యాడర్‌ను నింపుకుని మంచి జోష్ మీద ఉన్నట్లు సమాచారం. దీంతో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ చేపడుతున్నారు.
 
 గతంలో జరిగిన సంఘటనలు
 2013లో మండలంలోని ఎర్రసామంతవలసలోని బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌కు మావోరుుస్టులు నిప్పు పెట్టారు. అలాగే వారోత్సవాలకు పిలుపునిచ్చిన సమయంలో ఎర్రసామంతవలస, దుగ్గేరు గ్రామాల్లో బ్యానర్లు, వాల్‌పోస్టర్లు వెలిశాయి. కొద్దికాలంగా ప్రశాంతంగా ఉన్న ఏఓబీలో పట్టు కోసం అలు మావోయిస్టులు ఇటు పోలీసులు ప్రయత్నిస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని మన్యం ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement