
నటి శ్రీవాణి వివాదంపై విచారణ
బాధితురాలు అనూషకు న్యా యం జరిగేలా చూస్తామని వికారాబాద్ మహిళా ఠానా సీఐ నిర్మల తెలిపారు.
♦ బాధితురాలు అనూషకు న్యాయం జరిగేలా చూస్తాం
♦ వివాదానికి కారణమైన ఇంటి స్థలాన్ని
♦ పరిశీలించిన సీఐ నిర్మల
పరిగి: బాధితురాలు అనూషకు న్యా యం జరిగేలా చూస్తామని వికారాబాద్ మహిళా ఠానా సీఐ నిర్మల తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిగికి చెందిన అనూష, బుల్లితెర నటి శ్రీవాణి ఇంటి స్థలం విషయంలో గొడవకు దిగడంతో పాటు ఘర్షణ పడి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో కేసు నమోదైన విష యం తెలిసిందే. ఈనేపథ్యంలో వికారాబాద్ మహిళా ఠాణా సీఐ నిర్మల గురువారం పరిగిలోని వివాదస్పద ఇంటి స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. స్థానికులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో మాట్లాడి ఆరా తీశారు.
నటి శ్రీవాణి పలుమార్లు సదరు ఇంటి స్థలాన్ని సందర్శించిందని, తన వదిన అనూషపై బెదిరింపులకు పాల్పడిందని అక్కడికి వచ్చినవారందరు సీఐకి వివరించారు. సీఐ వారందరి వాంగ్మూలాలు నమోదు చేశారు. గతంలో శ్రీవాణి సదరు ఇంటిని కూల్చేందుకు యత్నించిందని.. ఆ తర్వాత ఇల్లు పూర్తిగా కూలిపోరుుందని సీఐకి చెప్పారు. గత సోమవారం కూడా పరిగికి వచ్చిన శ్రీవాణి అనూషపై దాడికి పాల్పడిందన్నారు. అనూషకు న్యాయం చేయాలని గ్రామపెద్దలు కొప్పుల నాగిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు భాస్కర్, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు సురేందర్ తదితరులు సీఐ నిర్మలను కోరారు. ఏ ఆధారం లేని అనూషకు న్యాం చేయాలన్నారు.