దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా పనిచేయాలి | independance celebration in jntu | Sakshi
Sakshi News home page

దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా పనిచేయాలి

Aug 15 2017 10:46 PM | Updated on Sep 17 2017 5:33 PM

దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా పనిచేయాలి

దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా పనిచేయాలి

దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా పనిచేయాలని జేఎన్‌టీయూ అనంతపురం ఇన్‌ఛార్జ్‌ వీసీ ప్రొఫెసర్‌ కే.రాజగోపాల్‌ అన్నారు.

జేఎన్‌టీయూ: దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా పనిచేయాలని జేఎన్‌టీయూ అనంతపురం ఇన్‌ఛార్జ్‌ వీసీ ప్రొఫెసర్‌ కే.రాజగోపాల్‌ అన్నారు. జేఎన్‌టీయూ అనంతపురంలో 71వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేసిన అనంతరం ఇన్‌ఛార్జ్‌ వీసీ ప్రసంగించారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల ఆదర్శాలను తీసుకొని దేశం, సమాజం అభ్యున్నతికి పాటుపడాలన్నారు.

వర్సిటీ పరిధిలోని బోధన పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో రెక్టార్‌ ప్రొఫెసర్‌ డి.సుబ్బారావు, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కృష్ణయ్య, డైరెక్టర్లు ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్, ప్రొఫెసర్‌ ఆనందరావు, ప్రొఫెసర్‌ కే.రామానాయుడు, ప్రొఫెసర్‌ ప్రశాంతి, ప్రొఫెసర్‌ పి.చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement