అడవిలో దారి తప్పిన ప్రేమజంట | IIIT students missing in ysr district forest | Sakshi
Sakshi News home page

అడవిలో దారి తప్పిన ప్రేమజంట

Feb 8 2016 9:22 PM | Updated on Sep 3 2017 5:11 PM

అడవిలో దారి తప్పిన ప్రేమజంట

అడవిలో దారి తప్పిన ప్రేమజంట

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చదువుకునే ఓ విద్యార్థి, విద్యార్థినిలు శేషాచలం అడవుల్లో తప్పిపోయారు.

వేంపల్లె: వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చదువుకునే విద్యార్థి, విద్యార్థిని శేషాచలం అడవుల్లో తప్పిపోయారు. కళాశాలలో పీయూసీ రెండో సంవత్సరం చదువుకుంటున్న ఇద్దరు విద్యార్ధులు శనివారం నుంచి కనిపించకుండా పోయారు.

ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థి, చిత్తూరు జిల్లాకు చెందిన విద్యార్ధిని సోమవారం కళాశాలకు రాకపోవడంతో వీరి అదృశ్యం విషయాన్ని ట్రిపుల్ ఐటీ నిర్వాహకులు కుటుంబసభ్యులకు తెలిపారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, శేషాచలం అడవుల్లో చిక్కుకున్నామని, దారి తెలియక ఇబ్బందులు పడుతున్నామంటూ వారు సోమవారం సాయంత్రం కుటుంబసభ్యులకు ఫోన్‌లో సమాచారమిచ్చారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు మూడు బృందాలుగా విడిపోయిన సెల్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement