సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని బీఎస్పీ తెలంగాణ........
బెజ్జంకి: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని బీఎస్పీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కోఆర్డినేటర్ గౌరీప్రసాద్ ఉపాసక్ విమర్శించారు. అసత్యప్రచారాలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. మండలకేంద్రంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి తానే సీఎం పీఠం ఎక్కారని విమర్శించారు. 2019 ఎన్నికల నాటికి బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేయాలని కార్యకర్తలకు సూచించారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదుర్ల మల్లేశం, కార్యదర్శులు మాతంగి అశోక్, ఎలగందుల వెంకన్న, జిల్లా అధ్యక్షుడు పెండ్యాల ముదిరాజ్, ఉపాధ్యక్షుడు మంద బాలయ్య, కార్యదర్శులు నరేశ్, రమేశ్, కోశాధికారి మోహన్, నియోజకవర్గ అధ్యక్షుడు నిశాని రామచంద్రం, మండలాధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, మహిళా విభాగం కన్వీనర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.