హోదా కోసం కలిసికట్టుగా పోరాడుదాం | Hunger strike for special status | Sakshi
Sakshi News home page

హోదా కోసం కలిసికట్టుగా పోరాడుదాం

Aug 26 2016 9:32 PM | Updated on Mar 23 2019 9:10 PM

హోదా కోసం కలిసికట్టుగా పోరాడుదాం - Sakshi

హోదా కోసం కలిసికట్టుగా పోరాడుదాం

నెల్లూరు(సెంట్రల్‌): రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కలిసికట్టుగా పోరాడుదామని డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి పార్థసారధి పేర్కొన్నారు.

 
నెల్లూరు(సెంట్రల్‌): రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కలిసికట్టుగా పోరాడుదామని డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి పార్థసారధి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం మాగుంట శరత్‌చంద్రారెడ్డి యువజన సేవా సమితి ఆ«ధ్వర్యంలో గాంధీబొమ్మ సెంటరులో శుక్రవారం చేపట్టిన ఒక్క రోజు  నిరాహార దీక్షకు వారు  సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విభజించారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. హోదా సాధించేందుకు కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ దీక్షల్లో సమితి సభ్యులు సాయి, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement