యాదాద్రిలో భక్తుల రద్దీ | huge croud in yadadri temple | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో భక్తుల రద్దీ

Nov 15 2015 9:11 AM | Updated on Aug 29 2018 4:16 PM

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది.

యాదాద్రి(నల్లగొండ): తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఆదివారం ఉదయం నుంచే  శ్రీ లక్ష్మి నర్సింహ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

ధర్మ దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. యాదాద్రి కొండపై సత్యనారాయణస్వామి వ్రత మండపం భక్తులతో కిక్కిరిసిపోయింది. వ్రత టికెట్ల కోసం భక్తులు బారులుతీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement