కలెక్టరేట్ వద్ద హాస్టల్ విద్యార్థుల ఆందోళన | Hostel students protests at karimnagar collectorate | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్ వద్ద హాస్టల్ విద్యార్థుల ఆందోళన

Aug 21 2015 9:46 AM | Updated on Sep 3 2017 7:52 AM

వసతి గృహంలో భోజనం సరిగా పెట్టటం లేదంటూ విద్యార్థులు శుక్రవారం ఆందోళన దిగారు.

కరీంనగర్ : వసతి గృహంలో భోజనం సరిగా పెట్టటం లేదంటూ విద్యార్థులు శుక్రవారం ఆందోళన దిగారు. ఈ ఘటన శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద చోటు చేసుకుంది. కరీంనగర్లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలకు చెందిన 200 మంది విద్యార్థులు శుక్రవారం కలెక్టరేట్ వద్దకు భారీ ర్యాలీగా తరలివచ్చి ... గేటు వద్ద బైఠాయించారు.

పాఠశాలకు అనుబంధంగా ఉన్న హాస్టల్లో సరైన టిఫిన్ పెట్టడం లేదని... మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదంటూ వసతి గృహం విద్యార్థులు ఆరోపించారు. ఇదేమని అడిగితే నిర్వహాకులు దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టరేట్లో అధికారులు ఎవరు లేరని... వారు వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement