లింగాయపాలెంలో ఉద్యాన పంటల సాగు | horticulture at lingayapalem | Sakshi
Sakshi News home page

లింగాయపాలెంలో ఉద్యాన పంటల సాగు

Nov 12 2016 10:02 PM | Updated on Jun 4 2019 5:04 PM

లింగాయపాలెంలో ఉద్యాన పంటల సాగు - Sakshi

లింగాయపాలెంలో ఉద్యాన పంటల సాగు

మండలంలోని లింగాయపాలెంలో ఉద్యాన , కూరగాయల పంటలు సాగవుతున్నాయి. ల్యాండ్‌ పూలింగ్‌లో ప్రభుత్వానికి భూములు ఇవ్వని రైతులు తమ పొలాలను సాగు చేసుకుంటున్నారు.

తుళ్లూరు: మండలంలోని లింగాయపాలెంలో ఉద్యాన , కూరగాయల పంటలు సాగవుతున్నాయి. ల్యాండ్‌ పూలింగ్‌లో ప్రభుత్వానికి భూములు ఇవ్వని రైతులు తమ పొలాలను సాగు చేసుకుంటున్నారు. ఈ ఏడాది గతంలో మాదిరిగానే 365 రోజులు తమ పొలాల్లో పంటలు సాగు చేసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు. పూలింగ్‌ భూములు ఇవ్వనందుకు ఏమాత్రం బాధపడటం లేదని, తమకు వ్యవసాయమే ముఖ్యమని రైతులు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం రైతులకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఈ రోజు వరకూ తమకు కలగకపోవడం వల్లే తాము ప్రభుత్వానికి భూములు ఇవ్వలేక పోతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో నడుస్తున్న కేసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.  



 

Advertisement
 
Advertisement
Advertisement